TS Police Recruitment | ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిమిలినరీ పరీక్షల తేదీల ప్రకటన
హైదరాబాద్ : ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిమిలినరీ పరీక్షలు నిర్వహించే తేదీలను బోర్డు ప్రకటించింది. ఆగస్ట్ 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) సోమవారం వెల్లడించింది. ఆగస్ట్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం 80,039 పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 17,291 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఏప్రిల్ 28న నోటిఫికేషన్లను సైతం జారీ చేసింది. ఆయా నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 17,291 పోస్టుల్ని భర్తీ చేయనున్నది. ఇందులో 554 ఎస్ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్ పోస్టులు, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే బోర్డు దరఖాస్తులను సైతం స్వీకరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తున్నది. పరీక్షలకు హాజరయ్యే ఎస్ఐ అభ్యర్థులు ఈ నెల 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్లు ఆగస్ట్ 10 నుంచి www.tsprb.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఎస్ఐ పోస్టులకు 2.45లక్షల మంది అభ్యర్థులు, కానిస్టేబుల్ పోస్టులకు 6.50లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్ఐ పోర్టులకు హైదరాబాద్ సహా 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు, కానిస్టేబుల్ పోస్టులకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

