TS PECET | హైదరాబాద్ : టీఎస్ పీఈసెట్-2024 షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేష్ కలిసి విడుదల చేశారు. మార్చి 12వ తేదీన నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
మార్చి 14 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మే 15. ఆలస్య రుసుముతో మే 31వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించొచ్చు. జూన్ 10 నుంచి 13వ తేదీ మధ్యలో టీఎస్ పీఈసెట్ రాతపరీక్షలను నిర్వహించనున్నారు. టీఎస్ పీఈసెట్ ద్వారా బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది టీఎస్ పీఈసెట్ను శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తోంది.