TS PECET 2023 | హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీఎస్ పీఈసెట్-2023 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేష్ కలిసి విడుదల చేయనున్నారు. ఫలితాలు https://pecet.tsche.ac.in/ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టీఎస్ పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్ పీఈసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.