Telangana | ఐసెట్, ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్, ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది.
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్, ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది.
ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్..
ఐసెట్ కౌన్సెలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది. 14 నుంచి 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 16 నుంచి 19వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25వ తేదీన ఎంబీఏ, ఎంసీఏ తొలి విడుత సీట్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి తుది విడుత ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 1 నుంచి 3వ తేదీ వరకు తుది విడుత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 7న తుది విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్ 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.
ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్
ఈసెట్ కౌన్సెలింగ్ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఈసెట్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 4 వరకు ఈసెట్ అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 8న ఈసెట్ అభ్యర్థులకు తొలి విడుత సీట్లను కేటాయించనున్నారు. ఆగస్టు 20 నుంచి ఈసెట్ తుది విడుత ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్టు 26న ఈసెట్ అభ్యర్థులకు తుది విడుత సీట్లు కేటాయించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

