Police Constable | కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..! పోస్టుల భర్తీపై హైకోర్టు కీలక ఆదేశాలు..!
Police Constable | తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోయింది. అయితే, అభ్యర్థులకు గతంలో నాలుగు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను.. హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం కొట్టివేసింది.
Police Constable | తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోయింది. అయితే, అభ్యర్థులకు గతంలో నాలుగు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను.. హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం కొట్టివేసింది. నాలుగు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది ధర్మాసనం ఆదేశించగా.. 15,640 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది.
తెలంగాణలో సివిల్, ఏఆర్ తదితర 16,604 పోస్టుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసి.. అర్హత పరీక్షలు నిర్వహించింది. ఇందులో 15,640 మంది అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 2023 ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాత పరీక్షలను నిర్వహించిన పోలీస్ నియామక బోర్డు.. ఫలితాలను అక్టోబర్ 4న విడుదల చేసింది.
అయితే, రాత పరీక్షలు నాలుగు ప్రశ్నలు వచ్చాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ధర్మాసనం నియామకాలపై స్టే విధించింది. నాలుగు మార్కులు కలపాలని ఆదేశించింది. దీంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన బెంచ్.. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

