Gurukula Exams | ఆగస్టు ఒకటి నుంచి గురుకుల పరీక్షలు..!
Gurukula Exams | గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి 23 వరకు పోస్టులవారీగా కంప్యూటర్ అధారిత పరీక్ష (CBT)ను నిర్వహించనున్నారు.
Gurukula Exams | గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి 23 వరకు పోస్టులవారీగా కంప్యూటర్ అధారిత పరీక్ష (CBT)ను నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (TRIB) ఇప్పటికే షెడ్యూల్ను ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి మొత్తంగా తొమ్మిది కేటగిరీల్లో తొలి విడతలో 9,210 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ బాధ్యతను ట్రిబ్కు అప్పగించింది. అందులో భాగంగా పీజీటీ 1276, టీజీటీ 4020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టుల భర్తీకి ట్రిబ్ తొలుత చర్యలు చేపట్టింది. అన్ని పోస్టులకు కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయని ట్రిబ్ ఇప్పటికే ప్రకటించింది. ఇక అభ్యర్థులకు ఆగస్టు1 నుంచి 23 వరకు తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో పరీక్షలను నిర్వహించాలని ట్రిబ్ నిర్ణయించింది.
గురుకులాల్లోని వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ట్రిబ్ ఇప్పటికే సూచించింది. గురుకుల నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ట్రిబ్ చర్యలు చేపట్టింది. పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలను నిర్వహించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలను రూపొందిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

