Telangana | స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన
Telangana | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ శుభవార్త వినిపించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ శుభవార్త వినిపించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి, కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, జోనల్ పోస్టులకు, మల్టీ జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు.
ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ మొదలుకానుంది. మిగతా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అనంతరం చేపట్టనున్నారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకోనుంది. సీనియార్టీ ప్రాతిపదికన ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన జరగనుంది. 70 శాతానికి పైగా సమస్యలు ఉన్న దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పిల్లల్లో మానసిక దివ్యాంగులుంటే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

