KCR Nutrition Kit | త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు.. దస్త్రంపై సంతకం చేసిన సీఎం కేసీఆర్
KCR Nutrition Kit | రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం సంతకం చేశారు. తెలంగాణవ్యాప్తంగా 6.84లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందనున్నాయి.
KCR Nutrition Kit | రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం సంతకం చేశారు. తెలంగాణవ్యాప్తంగా 6.84లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతేడాది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల కోసం ఈ కిట్‌ను తీసుకువచ్చింది. గర్భిణులకు ప్రొటీన్లు, ఖనిజ లవణాలతో కూడిన కిట్ అందించేందుకు సిద్ధమైంది. ఈ కిట్‌లో కిలో ఖర్జూరాలు, ఐరన్ సిరప్ రెండు బాటిళ్లు, నెయ్యి 500 గ్రాములు, అల్బెండజోల్ ట్యాబెట్లు ఒక కప్పు, హార్లిక్స్ రెండు బాటిళ్ల చొప్పున ఈ కిట్‌లో ఉండనున్నాయి. రూ.2వేల విలువ చేసే ఈ కిట్‌ను ప్రభుత్వం గర్భిణులకు ఉచితంగా అందిస్తున్నది. 5వ నెల, 9వ నెలల్లో మొత్తం రెండుసార్లు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రభుత్వం అందించనున్నది.
తొలుత ఈ పథకాన్ని ములుగు, కామారెడ్డి, గద్వాల, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఆయా జిల్లాల్లో ఎక్కువమంది మహిళలు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్నట్లుగా ప్రభుత్వం గతంలో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో తొలుత పథకాన్ని ప్రారంభించింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయంతో 6.84లక్షల మంది గర్భిణులకు లబ్ధి చేకూరనున్నది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

