TS EdCET | హైదరాబాద్ : బీఎడ్ కోర్సు( BEd Course )లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ – 2023 షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి( TSCHE ) చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, టీఎస్ ఎడ్సెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి షెడ్యూల్ను విడుదల చేశారు.
ఈ నెల 4వ తేదీన ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. 6వ తేదీ నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 500, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 700 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 30వ తేదీన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. మే 5 నుంచి ఎడ్సెట్ వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 21న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు.