TS ECET | టీఎస్ ఈసెట్ తొలి విడుత సీట్ల కేటాయింపు.. 82.11 శాతం సీట్లు భర్తీ
TS ECET | టీఎస్ ఈసెట్ తొలి విడుత సీట్ల కేటాయింపు జరిగింది. తొలి విడుతలో ఇంజినీరింగ్ విభాగంలో 82.11 శాతం సీట్లు భర్తీ కాగా, ఫార్మసీ విభాగంలో 6.10 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
TS ECET | హైదరాబాద్ : టీఎస్ ఈసెట్ తొలి విడుత సీట్ల కేటాయింపు జరిగింది. తొలి విడుతలో ఇంజినీరింగ్ విభాగంలో 82.11 శాతం సీట్లు భర్తీ కాగా, ఫార్మసీ విభాగంలో 6.10 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసెట్-2023లో 20,895 మంది అర్హత సాధించగా, 12,953 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 12,880 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోగా, ఇంజినీరింగ్ విభాగంలో 9,606 సీట్లు, ఫార్మసీ విభాగంలో 74 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,231 సీట్లు మిగిలి ఉన్నాయి.
సెల్ఫ్ రిపోర్టింగ్ ఇలా..
ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్లు పొందిన విద్యార్థులు వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ నెల 12వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. లేని పక్షంలో సీటు ఆటోమేటిక్‌గా క్యాన్షిల్ అవుతుంది. అలాట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్న ఫీజును క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ఆ తర్వాత సీటు కన్ఫర్మేషన్ అవుతుంది. అయితే ట్యూషన్ ఫీజు చెల్లించే విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే.. రీఫండ్ చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

