రేపటి నుంచి ఎప్‌సెట్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఎప్‌సెట్ కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి శనివారం తెలిపారు.
- పరీక్ష ముగియగానే తెరపై మార్కులు
- నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ
- ఎప్‌సెట్ కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఎప్‌సెట్ కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి శనివారం తెలిపారు. తొలి విడుతలో 4,5 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. మూడ్రోజులపాటు విరామం తర్వాత మళ్లీ 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అభ్యర్థులకు సూచనలు :-
- ఎప్‌సెట్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పరీక్షకు రెండు గంటల ముందు నుంచే విద్యార్థులను సెంటర్లల్లోని అనుమతిస్తారు. ఉదయం 9, మధ్యాహ్నం 3 గంటల తర్వాత వచ్చిన వారిని అనుమతించరు.
- ఇక ఒకసారి సెంటర్లోకి ప్రవేశించిన తర్వాత పరీక్ష ముగిసే వరకు బయటికి రావడానికి వీల్లేదు.
- విద్యార్థులు హాల్‌టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డు (జిరాక్స్ కాదు), బ్లూ, బ్లాక్ కలర్ పెన్ మాత్రమే వెంట తీసుకెళ్లాలి.
- క్యాలిక్యులేటర్లు, లాగ్‌బుక్స్, పేజర్లు, సెల్ఫోన్లు, గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వ్యక్తిగత వస్తువులను అనుమతించరు.
- పరీక్ష సమయంలో కంప్యూటర్ చెడిపోతే, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తితే మరో కంప్యూటర్ను సమకూర్చుతారు.
- బయోమెట్రిక్ హాజరు నమోదు కోసం విద్యార్థులు చేతులకు మెహందీ, టాటూస్, ఇంక్ వంటి వాటిని వేసుకోవద్దు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం
ఎప్‌సెట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్ల చేశాం. ఒక్కో సెంటర్ వద్ద ఆరుగురు కానిస్టేబుళ్లతో బందోబస్తు ఉంచాం. విద్యుత్తు అంతరాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్నిశాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. ఆర్టీసీ కూడా అదనపు బస్సులు నడుపుతున్నది. విద్యార్థులు సకాలంలో సెంటర్లకు చేరుకోవడం ఉత్తమం. వీలైతే ముందుగానే సెంటర్లకెళ్లి చూసుకోవడం ఉత్తమం.
-వీ బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

