వాయిదా పడ్డ ఎంసెట్ అగ్రికల్చర్, ఈసెట్ పరీక్ష తేదీలు ఖరారు
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్, ఈసెట్ ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షను, ఆగస్టు 1న ఈసెట్, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు టీఎస్ పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆయా వెబ్సైట్ల నుంచి సంబంధిత అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

