దూసుకుపోతున్న కారు.. 11,581 ఓట్ల ఆధిక్యంలో నోముల భగత్
దూసుకుపోతున్న కారు | నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని కనబరుస్తున్న టీఆర్ఎస్ పార్టీ 16వ రౌండ్

నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని కనబరుస్తున్న టీఆర్ఎస్ పార్టీ 17వ రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి 11,581 ఓట్ల ఆధిక్యంతో ముందజంలో ఉన్నారు. రౌండ్ రౌండ్లోనూ టీఆర్ఎస్ పార్టీకి మంచి మెజార్టీ వస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానానికి పరిమితం కాగా, బీజేపీ అభ్యర్థి రవి కుమార్ డిపాజిట్ దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి.
వరుసగా తొలి తొమ్మిది రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించగా, 10, 11, 14వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్లో టీఆర్ఎస్కు 3,854, కాంగ్రెస్‌కు 3113 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోలయ్యాయి. ఆరో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,022, కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు వచ్చాయి.
ఎనిమిది రౌండ్లో టీఆర్ఎస్కు 3, 249, కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిదో రౌండ్లో టీఆర్ఎస్కు 2,205, కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు, పదో రౌండ్లో టీఆర్ఎస్కు 2,991, కాంగ్రెస్‌కు 3,166 ఓట్లు రాగా, పదకొండో రౌండ్లో టీఆర్ఎస్ కు 3,395, కాంగ్రెస్ పార్టీకి 2,225 ఓట్లు వచ్చాయి. పన్నెండో రౌండ్లో టీఆర్ఎస్ కు 3833, కాంగ్రెస్ కు 2578 ఓట్లు, పదమూడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 3,766 ఓట్లు, కాంగ్రెస్ కు 3546 ఓట్లు వచ్చాయి. 14వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 2,734 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 3,817 ఓట్లు రాగా, 15వ రౌండ్లో టీఆర్ఎస్కు 3203, కాంగ్రెస్ కు 2787 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 3475 ఓట్లు, కాంగ్రెస్ కు 3231 ఓట్లు వచ్చాయి. 17వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 3772 ఓట్లు, కాంగ్రెస్ కు 2349 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా కొవిడ్ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో సహా పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కౌంటింగ్‌లో 400 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

