Telangana | శాసనమండలిలో టీఆర్ఎస్ పార్టీదే హవా..
Telangana | రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసింది. అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ

హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసింది. అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మరోసారి నిరూపితమైంది. ఈ తీర్పు విపక్షాలకు చెంపపెట్టుగా అయింది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఊహాల్లో విహరిస్తున్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే ఉంది అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
పన్నెండుకు 12 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో శాసనమండలిలో మిత్రపక్షాలతో కలిసి టీఆర్ఎస్ బలం 39కి చేరింది. 36 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉండగా, ఇద్దరు ఎంఐఎం నుంచి, ఒకరు కాంగ్రెస్, మరొకరు స్వతంత్ర సభ్యుడు శాసనమండలికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ ప్రాతినిథ్యం గుండు సున్నా. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ఇక శాసనసభ కూడా 95 శాతం టీఆర్ఎస్ చేతిలో ఉంది. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీకి ఇమేజ్ తగ్గలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తుందన్న నమ్మకం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
శాసనమండలిలో బలాబలాలు..
టీఆర్ఎస్ సభ్యులు -36
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు -6
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు -13
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు -13
ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీలు -2
గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీలు -2
ఎంఐఎం సభ్యులు -2
కాంగ్రెస్ -1
ఇండిపెండెంట్ -1
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

