ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
ఎమ్మెల్యే బాల్క సుమన్ | బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ను ఇక నుంచి

కరీంనగర్ : బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ను ఇక నుంచి వెన్నుపోటు రాజేందర్‌గా పిలవాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ మండలంలోని 19 గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలతో బీఎస్సార్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా బాల్క సుమన్ హాజరై ప్రసంగించారు.
సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ రాసిన లేఖ నిజమైందేనని, కానీ బీజేపీ ఫేక్ లేఖగా చిత్రీకరించి ప్రచారం చేస్తుందన్నారు. బండి సంజయ్‌కు దమ్ముంటే ఆ లేఖ ఫేక్ అని హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి, ఢిల్లీ దొరల దగ్గర మోకరిల్లాడు అని ధ్వజమెత్తారు. ఈటల ఇక నుంచి బీజేపీ రాజేందర్‌గానే మిగిలిపోతారు అని పేర్కొన్నారు. తనకున్న 200 ఎకరాల్లో.. ఒక్కో ఎకరం అమ్మి ఒక్కో ఎన్నికలో ఖర్చు పెట్టి గెలుస్తానని ఈటల చెప్పారు. ఆ డబ్బు సంచులతో వచ్చే బీజేపీ నాయకులతో జాగ్రత్తగా ఉండాలని సుమన్ సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు అక్కడే ఉంటానని బాల్క సుమన్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

