కులవృత్తులకు అండ

- 40 కులాలకు ఆత్మగౌరవ భవనాలు
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కార్యాచరణ
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): బడుగువర్గాలకు టీఆర్ఎస్ సర్కార్ గొడుగుపట్టింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితేనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని భావించిన ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ, ఉచిత చేపపిల్లల పంపిణీని చేపట్టింది. బీసీలు సమున్నతంగా బతికేందుకు హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్, కోకాపేటల్లో వంద కోట్లతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. అసెంబ్లీలో సంక్షేమ రంగంపై చర్చలో స్వరాష్ట్రంలో బీసీ కులాల అభ్యున్నతికి సర్కార్ చేపట్టిన కార్యక్రమాలను వెల్లడించింది.
- మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ సాలర్షిప్: విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు 20 లక్షల సాయం. ఇప్పటికి1,630 మందికి రూ.181.13 కోట్లు లబ్ధి.
- బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాలు: స్వరాష్ట్రంలో 281కి చేరిన బీసీ గురుకు లాలు. ఏటా 1.32 లక్షల మంది చదువు. ఏడేండ్లలో 1,302 కోట్ల ఖర్చు.
- బీసీ ఆత్మగౌరవ భవనాలు: హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 40 ఆత్మగౌరవ భవనాలు. రూ.95.25 కోట్లు కేటాయింపు.
- గొర్రెల పంపిణీ: రూ.11వేల కోట్లతో గొల్ల కురుమలకు గొర్రెలపంపిణీ. మొదటి దశలో రూ.4,780 కోట్ల ఖర్చుతో 3.81 లక్షల యూనిట్లు పంపిణీ. రెండో దశలో యూనిట్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంపు.
- చేపల పంపిణీ: ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ సీం. వెయ్యికోట్లతో 1.18 లక్ష మత్స్యకారులకు లబ్ధి. వందశాతం సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ. 2015-2021వరకు రూ.266.81 కోట్లతో 10,16,799 మందికి లబ్ధి.
- వందశాతం సబ్సిడీతొ రొయ్య పిల్లల పంపిణీ: 2015-2021 వరకు రూ.11 కోట్ల 84 లక్షల ఖర్చుతో 2.95 లక్షల మందికి లబ్ధి.
- గీత కార్మికులకు సంక్షేమం: కార్మికులు మరణిస్తే పరిహారం 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు. అంగవైకల్యానికి పరిహారం 50వేల నుంచి 5 లక్షలకు పెంపు. రాజధానిలో కల్లు డిపోల పునరుద్ధరణ. చెట్ల రకం బకాయిల రద్దు.
- నేత కార్మికుల సంక్షేమం: 50 శాతం సబ్సిడీపై నూలు, రసాయనాలు. 5 లక్షల ఉచిత బీమా. కొవిడ్ కాలంలో పని కోల్పోయిన 28,438 మంది చేనేత, మరమగ్గాల కార్మికులను ఆదుకోవడానికి రూ.102.46 కోట్లు విడుదల.
- నేతన్నలకు రుణమాఫీ: రూ.లక్ష వరకున్న 10,148 చేనేత కార్మికుల రుణాలు రూ.28.96 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది.
- టెక్స్టైల్ పారుల స్థాపన: మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,950.86 కోట్లు. వరంగల్‌లో మెగా టెక్స్టైల్ పార్. సిరిసిల్లలో అప్పరెల్ పార్, వీవింగ్ పార్. 28 వేల మంది కార్మికులకు ఉపాధికి అవకాశం.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- handicrafts
- trs gov
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

