హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే

- మనసులో మాటను బయటపెట్టిన ఈటల రాజేందర్
- సోషల్ మీడియాలో మాజీ మంత్రి మాటలు హల్చల్
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగబోయే ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన శనివారం బీజేపీ నాయకులతో కలిసి హుజురాబాద్‌లోని వెంకటసాయి గార్డెన్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఇక్కడ ముందుగా రాజేందరే మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో రేపు ఎగురబోయేది గులాబీ జెండా మాత్రమే అంటూ తన స్వీచ్ ఆరంభించారు. ఆ వెంటనే కాషాయం కండువా కప్పుకున్న విషయం గుర్తుకు వచ్చి నాలుక కరుచుకున్నారు. తాను చెప్పిన విషయాన్ని సవరించుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆయన షాక్ గురైనట్టుగా కనిపించింది. ఈటల ఎంత సవరించుకున్నా ప్రజలు మాత్రం అతని మనసులోని మాటనే బయటకు వచ్చిందని అంటున్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఈటల చెప్పడంలో పెద్ద అశ్చర్యం లేదని, ఆ విషయం అతనికి తెలుసు కాబట్టే గుండెల్లో నుంచి వచ్చిందంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

