ఎమ్మెల్యేను నిలదీసిన ట్రిపుల్ఆర్ బాధితులు
‘మమ్మల్ని ఊరి నుంచి వెళ్లగొట్టేందుకే మీకు ఓట్లేసి గెలిపించినమా? రిజినల్ రింగ్ రోడ్డుతో మా ఊరికి అన్యాయం జరుగుతుంది. మీరు చాలా మోసం చేస్తున్నారు’ అంటూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై ట్రిపుల్ ఆర్ బాధితురాలు బొల్లారం మల్లమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘రోడ్డు కావాలి.. అయితే మేం బతికేందుకు కూడా భూములుండాలి కదా?’ అని నిరసన వ్యక్తం చేశారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లిలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.
- ఈ రోడ్డుతో మా బతుకులు ఆగమైతున్నయ్
- ఊరినుంచి వెళ్లగొట్టేందుకే ఓట్లేసి గెలిపించినమా?
- మా గ్రామానికి న్యాయం చేయాలి
- దాతారుపల్లిలో ట్రిపుల్ ఆర్ బాధిత రైతుల ఆందోళన
- ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్యను నిలదీసిన మహిళా రైతు
యాదగిరిగుట్ట, అక్టోబర్ 22: ‘మమ్మల్ని ఊరి నుంచి వెళ్లగొట్టేందుకే మీకు ఓట్లేసి గెలిపించినమా? రిజినల్ రింగ్ రోడ్డుతో మా ఊరికి అన్యాయం జరుగుతుంది. మీరు చాలా మోసం చేస్తున్నారు’ అంటూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై ట్రిపుల్ ఆర్ బాధితురాలు బొల్లారం మల్లమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘రోడ్డు కావాలి.. అయితే మేం బతికేందుకు కూడా భూములుండాలి కదా?’ అని నిరసన వ్యక్తం చేశారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లిలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న రైతులు ఒక్కసారిగా ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు రావాలి కానీ, భూములు కోల్పోయిన వారికి కూడా బతుకు దెరువు చూపించాలి కదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట నుంచి దాతారుపల్లికి వచ్చేందుకు రోడ్డు వేస్తే ఎంతో మంది తమ భూములు ఇచ్చారు కదా? ఇది కూడా అంతే.. అంటూ పొంతనలేని సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు ఓట్లేసి గెలిపించినందుకు ఊరినే వదిలివెళ్లే పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం భూములు కోల్పోయిన వారికి మార్కెట్ ధరైనా ఇప్పించాలని డిమాండ్ చేశారు. ‘ఏం కొట్లాడుతవో? ఏం చేస్తవో తెల్వదు.. మా దాతారుపల్లికి న్యాయం చేసి చూపించాలి. చూపించినంకనే మాట్లాడుతాం’ అని ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

