హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధపోరులో,కమ్యూనిస్టు ఉద్యమంలో దివంగత నేత బొమ్మగాని వెంకటయ్య ప్రముఖ పాత్ర పోషించారని పలువురు కొనియాడారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆయన రెండో కుమారుడి నివాసంలో ఉంచిన వెంకటయ్య భౌతికకాయానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు డు పల్లా వెంకట్‌రెడ్డి, ప్రజాపక్షం ఎడిటర్శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నేత దేవేందర్‌గౌడ్, సీపీఐ నేతలు ఉజ్జిని రత్నాకర్, పల్లా నరసింహారెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, రవీంద్రచారి, బాలరాజ్, అంజయ్య, కేవీఎల్, లక్ష్మణ్, కరుణ, రిటైర్డ్ న్యాయమూర్తి ఎం కాంతయ్య ఉన్నారు. వెంకటయ్య భౌతికకాయాన్ని వారి స్వస్థలం సూర్యాపేటకు తరలించారు.