Minister KTR | పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఆశీర్వదిస్తారు: మంత్రి కేటీఆర్
Minister KTR | ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి చేసిందన్నారు.
హైదరాబాద్: ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ప్రోగ్రామ్‌లో మంత్రి పాల్గొన్నారు. జేఆర్సీ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి చేసిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందే కనిపిస్తోందన్నారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఈ మహానగరానికి చారిత్రకంగా గొప్ప పేరుందని అన్నారు. పాత హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందినదని నటుడు రజినీకాంత్ పొగిడిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అభివృద్ధిలో హైదరాబాద్ న్యూయార్క్‌తో పోటీ పడుతోందని అన్నారు.
గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైవోర్లు నిర్మించామని, 39 చెరువులను నవీకరించామని మంత్రి చెప్పారు. మిషన్ భగీరథ కార్యక్రమంతో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు. అదేవిధంగా దేశంలో నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

