Husband Birthday | భర్తంటే ఎంత ప్రేమో.. చెట్టుకు భర్త డ్రెస్ తొడిగి జయంతి వేడుక
చనిపోయిన భర్త జ్ఞాపకాలను చెట్టు లో చూసుకుంటూ ఏటా జయం తి చేస్తున్నది వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి.
తాండూరు, జూలై 29: చనిపోయిన భర్త జ్ఞాపకాలను చెట్టు లో చూసుకుంటూ ఏటా జయం తి చేస్తున్నది వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి. సోమవారం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఓ చెట్టుకు చనిపోయిన తన భర్త డ్రెస్ వేసి వినూత్నంగా చెట్టుకు పుట్టినరోజు, భర్తకు జయంతిని నిర్వహించింది. ఎనిమిదేండ్ల క్రితం విజయలక్ష్మి భర్త వెంకటయ్య అనారోగ్యంతో ఉండగా, తన ఇంటి ఎదుట మొక్క నాటారు. ఆయన మరణానంతరం విజయలక్ష్మి ఆ మొక్కను జాగ్రత్తగా పెంచుతున్నారు. ఆ మొక్క ఇప్పుడు చెట్టయ్యింది. ఏటా కుటుంబసభ్యులతో కలిసి ఆ చెట్టుకు బెలూన్స్ కట్టి పుట్టినరోజు వేడుక నిర్వహిస్తున్నది. నేషనల్ హైవే వెడల్పులో భాగంగా విజయలక్ష్మి ఇంటి ముందున్న చెట్టును అధికారులు తొలగించే ప్రయత్నం చేయగా.. ఆమె వ్యవసాయ శాస్త్రవేత్తల అనుమతితో చెట్టును జేసీబీ సహాయంతో అక్కడికి తీసుకెళ్లి నాటారు. దీంతో ఆ చెట్టుకు పూజలు చేసి, పంచభక్ష పరమాన్నాలు పెట్టి వేడుక నిర్వహించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

