Trauma Centers | సూర్యాపేట,నల్లగొండ జిల్లాల్లో ట్రామా సెంటర్ల ఏర్పాటుకు రూ.47.50 కోట్లు మంజూరు
Trauma Centers |రోడ్డు ప్రమాద బాధితులకు సత్వరమే వైద్యసహాయం అందించేందుకు జాతీయ రహదారులపై ప్రభుత్వం మరో రెండు ట్రామా సెంటర్ల( Trauma Centers) ఏర్పాట్లకు నిర్ణయించింది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ట్రామా సెంటర్ల ఏర్పాట్ల కోసం రూ.47 కోట్ల 50 లక్షలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సూర్యాపేట కు రూ.23 కోట్ల 75 లక్షలు, నల్లగొండకు రూ. 23.75 కోట్లను మంజూరు చేసింది.
సూర్యాపేట: రోడ్డు ప్రమాద బాధితులకు సత్వరమే వైద్యసహాయం అందించేందుకు జాతీయ రహదారులపై ప్రభుత్వం మరో రెండు ట్రామా సెంటర్ల( Trauma Centers) ఏర్పాట్లకు నిర్ణయించింది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ట్రామా సెంటర్ల ఏర్పాట్ల కోసం రూ.47 కోట్ల 50 లక్షలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సూర్యాపేట కు రూ.23 కోట్ల 75 లక్షలు, నల్లగొండకు రూ. 23.75 కోట్లను మంజూరు చేసింది.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట(Suryapeta)లో, హైదరాబాద్-అద్దంకి జాతీయ రహదారిపై ఉన్న నల్లగొండ(Nallagonda) జిల్లా కేంద్రాల్లోని మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్సలకు(Emergency Treatment) సరిపడా ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
రెండు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులు ఉండడంతో క్షతగాత్రులకు వైద్యం సులువుగా అందించేందుకు ప్రభుత్వం ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తీసుకున్న ఈ నిర్ణయంపై రెండు జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రామా కేంద్రాల ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

