హైదరాబాద్, మార్చి 13(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలువురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా లేని పోస్టింగులు ఉంటే వెంటనే ప్రభుత్వానికి తెలపాలని కలెక్టర్లకు సూచించారు.