హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 25 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వీరిలో కొంత మందికి పోస్టింగులు కూడా ఇచ్చారు. గతంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ జీవో జారీ చేశారు. అయితే కొన్ని సవరణలతో డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ శుక్రవారం మరో జీవో (జీవో 88)ను విడుదల చేశారు. బదిలీ అయిన వారిలో 11 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 14 మంది డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. ఈ జీవో వెంటనే అమల్లోకి వస్తుందని జీవోలో పేర్కొన్నారు.