డ్రోన్ల వినియోగంపై శిక్షణ

- 2 సంస్థలతో వ్యవసాయ వర్సిటీ ఒప్పందం
- సర్టిఫికెట్ కోర్సు ప్రారంభానికి చర్యలు
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై గ్రామీణ యువతకు, రైతులకు శిక్షణ ఇవ్వాలని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ, మారుత్ డ్రోన్‌టెక్ సంస్థలతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకొన్నది. వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు సమక్షంలో రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్, సంస్థల ప్రతినిధులు హేమంత్ దండపాణి, ప్రేమ్‌కుమార్ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ ఇప్పటికే వ్యవసాయంలో డ్రోన్ల ప్రయోగానికి డీజీసీఏ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. డ్రోన్ల వినియోగంలో యువతకు శిక్షణకార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. త్వరలోనే సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. వర్సిటీ ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. డ్రోన్ల వినియోగంతో రైతులకు పెట్టుబడి ఖర్చు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని వీసీ అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

