Snakebite | విషాదం.. దంపతులకు పాముకాటు.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Snakebite | మెదక్ జిల్లా టేక్మాల్ మండలం లో విషాదం చోటు చేసుకుంది. పాముకాటు వల్ల భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా మారింది.
పాపన్నపేట : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ( Tekmal mandal ) లో విషాదం చోటు చేసుకుంది. పాముకాటు (Snakebite ) వల్ల భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా మారింది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. టేక్మాల్ మండలం పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడగట్టు గ్రామానికి చెందినమల్లయ్య గారి కవిత (35) సంగమేష్ దంపతులు వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు.
మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు ముగించుకుని ఇంటిలో నిద్రిస్తుండగా భార్యభర్తలకు నల్ల కట్ల పాము కాటు వేసింది. ఈ విషయం బాధితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పామును గుర్తించి చంపేశారు . పాము కాటుకు గురైన ఇరువురిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం భార్య కవిత మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయమై మృతురాలు మామ దుర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

