హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
Traffic Restrictions | నగరంలోని అరాంఘర్ నుంచి పురానాపూల్ వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి 44పై బహదూర్‌పూరా వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు

హైదరాబాద్: నగరంలోని అరాంఘర్ నుంచి పురానాపూల్ వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి 44పై బహదూర్‌పూరా వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆ మార్గంలో వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.
అరాంఘర్ నుంచి బహదూర్‌పురా మీదుగా పురానాపూల్ మార్గంలో రాకపోకలు సాగించే జిల్లా, సిటీ బస్సులు, ఇతర భారీ వాహనాలను అరాంఘర్ చౌరస్తా వద్ద దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఆ వాహనాలు మైలార్‌దేవ్‌పల్లి, ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్స్, చాంద్రాయణగుట్ట, ఐఎస్ సదన్, సైదాబాద్, నల్లగొండ క్రాస్ రోడ్డు మార్గంలో వెళ్లాలని, నగరంలో నుంచి వచ్చే భారీ వాహనాలు కూడా నల్లగొండ క్రాస్ రోడ్డు మీదుగా అరాంఘర్ రూట్లో వెళ్లాలని సూచించారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు యథావిధిగా అరాంఘర్ నుంచి పురానాపూల్‌కు రాకపోకలు సాగించవచ్చన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

