మల్లన్న సాగర్ సినిమా షూటింగ్లకు కేంద్రం కావాలి : సీఎం కేసీఆర్
సిద్దిపేట : మల్లన్న సాగర్ జలాశయం సినిమా షూటింగ్లకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఆ స్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.

ఇల్లంతకుంటలో అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద బ్రహ్మాండమైన ప్రకృతి సౌందర్యం ఉంది. అక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొట్లాడుతున్నాడు. పద్మా దేవేందర్ రెడ్డి నాబిడ్డ. ఏడుపాయల వద్ద అద్భుతమైన జలపాతం ఉంది.. మల్లన్నసాగర్తో సింగూరు ప్రాజెక్టును నింపుతారు. కాబట్టి ఏడుపాయల వద్ద టూరిజం ప్యాకేజీ కావాలని ఆమె అడుగుతున్నారు. హరీశ్రావు సిద్దిపేటలో రూ. 100 కోట్లు తీసుకున్నాడు. అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, బస్వాపూర్ రిజర్వాయర్, ఏడుపాయల వనదుర్గామాత వద్ద టూరిజం అభివృద్ధికి రూ. 1500 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాను. ఈ ఐదు ప్రాంతాల్లో అద్భుతమైన టూరిజం అభివృద్ది చేయాలి. హాలీవుడ్ సినిమా, హిందీ సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసుకునే విధంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు మధ్యలో ఐలాండ్స్ ఉన్నాయి. మల్లన్న సాగర్ వద్ద 7,500 ఎకరాల అటవీ సంపద ఉంది. రిజీనల్ రింగ్ రోడ్డు కూడా రాబోతుంది. రెండు ఫోర్ లైన్ రోడ్లు ఈ ప్రాజెక్టు వద్దకు వేయాలి అని సీఎం సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
Donation | కొమురం భీమ్ విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ నాయకుడు విరాళం
IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

