నేడే టెట్
- జీవితకాలం చెల్లుబాటు
- జూన్ 27న ఫలితాలు
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) ఆదివారం జరుగనున్నది. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ జరుగడం ఇది మూడోసారి. పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటయ్యేలా మార్పులు చేయడంతో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్-2 రాయడం ద్వారా బీఈడీ అభ్యర్థులు సూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు. ఈ సారి పేపర్-2 రాసే వారు కూడా పేపర్-1 రాసి, ఎస్టీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు. దీంతో పేపర్-1కు భారీగా దరఖాస్తులు వచ్చాయి.
2,683 పరీక్ష కేంద్రాలు
టెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 212, ములుగులో అతి తకువగా 15 పరీక్ష కేంద్రాలు పెట్టారు. ప్రతి పరీక్ష కేంద్రంలో పటిష్ఠ నిఘా ఏర్పాటుచేశారు. అన్నిచోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీనిని ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BEd
- Test centers
- TS TET EXAM
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

