రేపు హైదరాబాద్‌కు మోదీ.. 8 వేల మంది పోలీసులతో బందోబస్తు
హైదరాబాద్ : రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకనున్నారు. తిరిగి ఢిల్లీ వెళ్లే సమయంలోనూ మోదీకి మంత్రి తలసాని వీడ్కోలు పలకనున్నారు.
మరో వైపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సమతామూర్తి కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు. సుమారు 8 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఒకే చోట నుంచి భద్రతను పర్యవేక్షించేందుకు సమతామూర్తి కేంద్రంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, పోలీసులు భద్రత పర్యవేక్షిస్తారని డీజీపీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ముచ్చింతల్‌కు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఇక్రిశాట్, ముచ్చింతల్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద భద్రత పెంచామని పేర్కొన్నారు. ఏ ఆటంకాలు లేకుండా ప్రముఖుల పర్యటనకు ప్రణాళికలు రూపొందించామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

