సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 00:53:23

రోడ్డుప్రమాదంలో ముగ్గురి మృతి

రోడ్డుప్రమాదంలో ముగ్గురి మృతి
  • గుర్తుతెలియని వాహనం ఢీ..
  • ప్రయాణికుల ఆటో నుజ్జునుజ్జు
  • 16 మందికి గాయాలు

పెబ్బేరు రూరల్‌: పందొమ్మిది మందితో వెళ్తున్న ప్యాసింజర్‌ ఆటోను గుర్తుతెలియని వాహనడం ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా.. 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం శివారులో 44వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు, వైశాఖాపూర్‌ గ్రామాలకు చెందిన 19 మంది జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలోని ఓ చర్చిలో నిర్వహించిన ఉత్సవానికి ఆటోలో వెళ్లి శుక్రవారం రాత్రి తిరుగుపయనమయ్యారు. పెబ్బేరు మండలం రంగాపురం శివారులో వీరు ప్రయాణిస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టి రోడ్డు పక్కనున్న గోతిలో పడిపోయింది. ఈ ఘటనలో శాఖాపూర్‌కు చెందిన వల్గుమాన్‌ చిట్టెమ్మ (30), ఎలిసన్‌(6) అక్కడికక్కడే మృతిచెం దగా.. కర్నూల్‌లో చికిత్స పొందుతూ భానుప్రసాద్‌(5) అనే బాలుడు మరణించాడు. కాగా గాయపడ్డ 16 మందిని వనపర్తి ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి పలువురిని కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ దవాఖానలకు తీసుకెళ్లారు. వీరిలో వల్గుమాన్‌ భాస్కర్‌, మౌనిక, సుజాత, చంద్రమ్మల పరిస్థితి విషమంగా ఉంది. logo