హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) సభ్యులుగా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఐజేయూ అధ్యక్షుడు గీతార్థ్ పాఠక్ (అస్సాం), ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్ కోహ్లీ (చండీగఢ్), అదే యూనియన్‌కు చెందిన సభ్యుడు బిజాయ్ కే (మణిపూర్)ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా నామినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే-హెచ్-143) వంటి బలమైన సంఘంతోపాటు 21 రాష్ట్రాల జర్నలిస్టు యూనియన్లతో కలిసి జాతీయస్థాయిలో జర్నలిస్టుల హకుల పరిరక్షణకు ఐజేయూ కృషి చేస్తున్నదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి, ఐజేయూ కోశాధికారి ఆసాని మారుతిసాగర్ పేరొన్నారు. ఐజేయూ నుంచి ముగ్గురికి ప్రెస్ కౌన్సిల్ సభ్యత్వాలు లభించడం యూనియన్‌కు దకిన గౌరవంగా అభివర్ణించారు. సభ్యులు జర్నలిస్టుల హకులు, ప్రయోజనాలను కాపా డాలని, మీడియా స్వేచ్ఛను కాపాడేదిశగా చొరవ చూపాలని ఆకాంక్షించారు.