పాల్వంచలో విషాదం.. ఇంట్లో గ్యాస్ లీకేజీతో కుటుంబం సజీవదహనం
Gas leak | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పాత పాల్వంచ తూర్పు బజార్లో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీతో (Gas leak) కుమార్తె సహా దంపతులు సజీవదహనమయ్యారు

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పాత పాల్వంచ తూర్పు బజార్లో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీతో (Gas leak) కుమార్తె సహా దంపతులు సజీవదహనమయ్యారు. తూర్పు బజార్‌కు చెందిన శ్రీలక్ష్మి, మండిగ నాగ రామకృష్ణ భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం వేకువజామున ఇంట్లో గ్యాస్ లీకవడంతో దంపతులు సహా ఒక చిన్నారి సజీవ దహనమయ్యారు. మంటలు అంటుకోవడంతో మరో కుమార్తె తీవ్రంగా గాయపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారని పాల్వంచ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆమెకు 80 శాతం గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్యా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

