శ్రీమద్రామానుజ సహస్రాబ్ది మూడో రోజు ఉత్సవాలు.. 5 వేల మంది రుత్విజులతో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వేదపండితులతో వేదపారాయణం అంగరంగ వైభవంగా జరిగింది
భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు ఆసన్నమయ్యాయి. శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో కీలక ఘట్టం 216 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం సమతామూర్తిని జాతికి అంకితం చేయనున్నారు. పీఎం పర్యటన నేపథ్యంలో శ్రీరామ నగర పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. హెలీప్యాడ్, సమతామూర్తి ప్రాంగణం, యాగశాలల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాగశాల చుట్టూ మెటల్ డిటెక్టర్లను అమర్చారు. ముచ్చింతల్ శ్రీరామనగరం పూర్తిగా పోలీసుల పహారాలో ఉంది. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని రాక సందర్భంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని… భక్తులు సహకరించాలని, కోవిడ్ నియమాలను పాటించాలని సూచించారు.
మూడో రోజు కార్యక్రమంలో భాగంగా యాగశాలలో అష్టాక్షరీ మహామంత్ర జపంతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆపై హోమాలు, చతుర్వేద పారాయణాలను నిర్వహించారు. 5 వేల మంది రుత్విజులు శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువును కొనసాగించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వేదపండితులతో వేదపారాయణం అంగరంగ వైభవంగా జరిగింది. యాగంలో 10 మంది జీయర్ స్వాములు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీ నారాయణ క్రతువులో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు నిత్య ఆరాధనాగోష్ఠిని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆసాంతం మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రవచన మండపంలో ఈరోజు శ్రీచిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామావళి పూజను భక్తులచే నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో స్వామివారి ఉపదేశానుసారం భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. అయోధ్య నుంచి విచ్చేసిన శ్రీవిద్యాసాగర స్వామి సంస్కృతంలో రామానుజ స్వామి వారి విశిష్టతను, శ్రీరామ నగర విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ కృష్ణమాచార్యులు కూడా పాల్గొన్నారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ స్థానాచార్యులు ప్రవచనకర్త శ్రీమాన్ స్థలసాయి రామానుజ వైభవంపై ప్రవచనాన్ని అందించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ ప్రవచనకర్త రంగనాథ భట్టర్ వారితో రామానుజుల దివ్య ప్రవచనాన్ని అందించారు. అనంతరం ప్రవచన మండపంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రజ్ఞా మనోజ్ఞ సంగీతం, పేరిందేవి బృందం నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమ సుమిత సంగీతం, మానస బృందంవారి భజన కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
ప్రవచన మండపంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. యాగశాలలో సాయంత్రం హోమాలు శాస్త్రోకంగా జరిగాయి. లక్ష్మీనారాయణ క్రతువులో భాగంగా చతుర్వేద పారాయణాలను వేదపండితులు ఘనంగా నిర్వహించారు.
రేపటి కార్యక్రమంలో భాగంగా వసంత పంచమి శుభవేళ విజయప్రాప్తికై విశ్వక్సేనేష్టి, విద్యాప్రాప్తికై హయగ్రేవేష్టి యాగశాలలో జరుగనున్నాయి. ప్రవచన మండపంలో శనివారం శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామ పూజ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

