Jagityala | మూలుగ బొక్క కోసం లొల్లి.. రద్దయిన పెళ్లి
Jagityala | చాలా పెళ్లిల్లు(marriages) అంగరంగవైభవంగా చేస్తుంటారు. అతిథులకు మర్యాదలో ఏ మాత్రం లోటు రాకుండా చూస్తుంటారు. ఎక్కడైనా లోటు వచ్చిందో.. పెళ్లిల్లు ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా చిన్న లోటు పెళ్లి ఆగిపోవడానికి కారణమైంది. మూలుగ బొక్క(Muluga Bokka)కోసం పెళ్లి రద్దయిన(Wedding cancelled) ఘటన నిజామాబాద్(Nizamabad) జిల్లాలో జరిగింది.
జగిత్యాల : చాలా పెళ్లిల్లు(marriages) అంగరంగవైభవంగా చేస్తుంటారు. అతిథులకు మర్యాదలో ఏ మాత్రం లోటు రాకుండా చూస్తుంటారు. ఎక్కడైనా లోటు వచ్చిందో.. పెళ్లిల్లు ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా చిన్న లోటు పెళ్లి ఆగిపోవడానికి కారణమైంది. మూలుగ బొక్క(Muluga Bokka)కోసం పెళ్లి రద్దయిన(Wedding cancelled) ఘటన నిజామాబాద్(Nizamabad) జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది.
దీంతో కట్న కానుకలు అన్ని మాట్లాడుకున్నారు. నవంబరు మొదటి వారంలో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ నిశ్చితార్థ వేడుకలో భాగంగా అమ్మాయి ఇంట్లో మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడిగారు. మూలగ బొక్క లేదనడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారి పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. తర్వాత ఇరువర్గాలు శాంతించినా పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

