ఎట్టకేలకు కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగింపు
జనగామ జిల్లా దేవరుప్పులలో ఎస్ఎస్-39 ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం యుద్ధప్రాతిపదికన ట్రాన్స్‌కో అధికారులు బిగించారు.
- జాప్యంపై ట్రాన్స్‌కో సీఎండీ ఆగ్రహం
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
దేవరుప్పుల, జూన్ 23 : జనగామ జిల్లా దేవరుప్పులలో ఎస్ఎస్-39 ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం యుద్ధప్రాతిపదికన ట్రాన్స్‌కో అధికారులు బిగించారు. దేవరుప్పులలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులైనా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు పోసుకున్న నారు, దున్నిన దుక్కులు ఎండిపోయాయి. పలుమార్లు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
ఇదే విషయమై ‘ట్రాన్స్ఫార్మర్ కాలి 15 రోజులాయె’ శీర్షికన ఆదివారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జాప్యంపై సంబంధిత అధికారులపై ట్రాన్స్‌కో సీఎండీ ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో కదిలిన అధికార యంత్రాంగం వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మన్‌ను బిగించి రైతుల కష్టాలు తీర్చింది. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి, పరిష్కారానికి కృషి చేసిన ‘నమస్తే’కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

