నాగర్ కర్నూల్ : మహిళా వర్కర్‌పై సూపర్వైజర్ లైంగిక దాడికి యత్నించిగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఓ మహిళా వర్కర్‌పై సూపర్వైజర్ మహేష్ లైంగికదాడికి ప్రయత్నించాడు. సాయి ఏజెన్సీ ఆఫీస్ క్లినిక్‌కి పిలిచిన సూపర్ వైజర్ మహేష్..ఆఫీస్ క్లీన్ చేస్తున్న మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె చాకచక్యంగా తప్పించుకొంది. బాధిత మహిళ తోటి కార్మికులతో కలిసి మెడికల్ కాలేజీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సూపర్ వైజర్‌కు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. నిన్న సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.