హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో భారీ ఎలివేటెడ్ కారిడార్
హైదరాబాద్-శ్రీశైలం రోడ్డు మార్గాన్ని మెరుగుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ ఫారెస్ట్ చెక్‌పోస్టు నుంచి శ్రీశైలం వరకు అత్యంత పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది.
- నాలుగు లేన్లతో 70 కి.మీ. మేర నిర్మాణానికి ప్రతిపాదన
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-శ్రీశైలం రోడ్డు మార్గాన్ని మెరుగుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ ఫారెస్ట్ చెక్‌పోస్టు నుంచి శ్రీశైలం వరకు అత్యంత పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే రాత్రి వేళల్లో సైతం ఎలాంటి అడ్డంకులు లేకుండా శ్రీశైలం వెళ్లేందుకు వీలవుతుంది. హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఉన్నందున ప్రస్తుతం మన్ననూరు చెక్‌పోస్టు నుంచి రాత్రి వేళల్లో ప్రయాణాలను అనుమతించడం లేదు.
ప్రస్తుతం ఆ మార్గంలో 70 కి.మీ. మేర డబుల్ లేన్ మాత్రమే ఉండడంతో ట్రాఫిక్ అవసరాలకు సరిపోవడం లేదు. ఈ మార్గాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ నల్లమల అటవీ ప్రాంతం కావడంతో అనుమతులు లభించడంలేదు. ఈ నేపథ్యంలో మన్ననూర్ చెక్‌పోస్టు నుంచి నల్లమల అటవీ ప్రాంతం మీదుగా శ్రీశైలం వరకు 4 లేన్లతో 70 కి.మీ. పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర ఆర్అండ్బీ శా ఖ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

