SSC Recruitment 2024 | కేంద్ర శాఖల్లో 2049 పోస్టులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) సెలక్షన్ పోస్టుల నియామక పరీక్ష (ఫేజ్-XII/ 2024)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
SSC Recruitment | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) సెలక్షన్ పోస్టుల నియామక పరీక్ష (ఫేజ్-XII/ 2024)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 2049 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో ఎస్సీ- 255, ఎస్టీ- 124, ఓబీసీ- 456, యూఆర్- 1028, ఈడబ్ల్యూఎస్- 186 కేటాయించారు. పోస్టును బట్టి 10, 12 తరగతులు, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.
అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. చివరితేదీ మార్చి 18. మరిన్ని వివరాలు https://ssc.nic. in వెబ్సైట్ లో చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ ఫీల్డ్‌మ్యాన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోర్‌మ్యాన్, జూనియర్ ఇంజినీర్, యూడీసీ, డ్రైవర్ కమ్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్, సూపర్వైజర్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కోర్ట్ క్లర్క్, సీనియర్ జియోగ్రాఫర్..మొదలైన ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

