రక్తసంబంధం.. విషాదాంతం
కుటుంబ కలహాలు వికృతరూపం దాల్చుతున్నాయి. పగలు, ప్రతీకారాలు చెలరేగి హత్యకు పురిగొల్పుతున్నాయి. రక్తసంబంధీకులను సైతం హతమార్చేలా ప్రేరేపిస్తున్నాయి. క్షణికావేశం తోటివారిని మట్టుబెట్టేస్థాయికి చెలరేగుతున్నాయి.
- క్షణికావేశంలో పగలు, ప్రతీకారాలు
- అధిక హత్యలు కుటుంబ కలహాల వల్లే!
- సెక్సువల్ జెలసీ కేసులూ అధికమే..
- 2022లో 762 హత్యకేసుల నమోదు
- 72 కేసుల్లో 96 మందికి జీవిత ఖైదు
- బంధాలే శాశ్వతం: సైకియాట్రిస్టులు
కుటుంబ కలహాలు వికృతరూపం దాల్చుతున్నాయి. పగలు, ప్రతీకారాలు చెలరేగి హత్యకు పురిగొల్పుతున్నాయి. రక్తసంబంధీకులను సైతం హతమార్చేలా ప్రేరేపిస్తున్నాయి. క్షణికావేశం తోటివారిని మట్టుబెట్టేస్థాయికి చెలరేగుతున్నాయి. వివాహేతర బంధాలు, తెలిసీ తెలియని ప్రేమలు ఎంతకైనా తెగించే స్థాయికి తీసుకెళ్తున్నాయి. అనుకున్నదే తడవుగా ఎదుటివారిని కసితో కాటికి పంపేస్తున్నారు. ఇలా ఎందరో క్షణికావేశానికి లోనై జీవితాతం జైలు పాలై జీవితాన్ని కోల్పోవడమే కాదు.. వారిని నమ్ముకున్న వారిని జీవితాంతం ఇక్కట్ల పాల్జేస్తున్నారు.
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): అది మలక్‌పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్. బైక్ నడుపుతున్న తమ్ముడిని వెనుకనుంచి కట్టర్‌తో గొంతుకోశాడు అన్న. లక్షల విలువజేసే ఆస్తిముందు రక్తసంబం ధం చిన్నపోయింది. రక్తం చిందిస్తూనే తనువు చాలించాడు తమ్ముడు. వారి మధ్య ఆస్తి చిచ్చుపెట్టింది. ఇదీ శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఘటన. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో ఒక మూలన కుటుంబ కలహాల నేపథ్యంలో గోడవలు చోటుచేసుకుంటున్నాయి. వికృతరూపం దాల్చి హత్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యం గా కుటుంబాల మధ్య చెలరేగిన చిన్నపాటి గొడవలే.. ప్రాణాలుతీసే వరకూ దారితీస్తుండటం ఆందోళన కలిగించే అంశం. భార్యాభర్తల కలహాల మొదలు పొలం గట్టు తగాదాలు, ఆస్తి పంపకాల వివాదాలు చెలరేగుతున్నాయి. చివరికి ఇంటి పెద్ద ఓ మాటగా హెచ్చరించినా తట్టుకోలేక హత్యలు చేసేదా కా తెగిస్తున్నారు. ఈ పెడధోరణితో కుటుంబవ్యవస్థ ప్రాధాన్యం తగ్గిపోతున్నదని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు.
‘నాకు దక్కనిది వేరొకరికి దక్కొద్దు’
రాష్ట్రంలో రెండేండ్లలో నమోదైన హత్య కేసుల్లో సెక్సువల్ జెలసీ (లైంగిక అసూయ) కేసులు భారీగా నమోదవుతున్నాయి. ‘నాకు దక్కనిది వేరొకరికి దక్కకూడదు’ అనే ధోరణి తీవ్రరూపం దాల్చుతుందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్షణికావేశానికి గురై.. మనసుపడిన వారిని చెరిచి, చివరికి ప్రాణాలు సైతం తీస్తున్నారు. సెక్సువల్ జెలసీ కేసులు 2022లో 125 నమోదవడం ఆందోళన కలిగించే అంశం.
మర్డర్ కేసులు తగ్గుముఖం
నేరస్థుల విషయంలో తెలంగాణ పోలీసులు చేపడుతున్న కొన్ని కఠినమైన చర్యలు, వేగవంతమైన దర్యాప్తు, కఠిన శిక్షలు, అవగాహన కార్యక్రమాల వల్ల హత్య కేసులు తగ్గుముఖం పట్టాయి. 2021 సంవత్సరంతో పోల్చితే, గత ఏడాది హత్యల రేటు 12.5 శాతం తగ్గింది. 2021లో 871 హత్య కేసులు నమోదు కాగా, 2022లో 762 కేసులు నమోదయ్యాయి. సుమారు 72 కేసుల్లో 96 మందికి జీవిత ఖైదు పడేలా చర్యలు పోలీసులు తీసుకున్నారు.
2022లో నమోదైన హత్య కేసులు

బలగంతోనే సంతోషం.. సౌఖ్యం
బలగం.. బంధుత్వంతోనే సంతోషం.. సౌఖ్యం ఉంటుంది. వివాదాలొచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గించుకుంటే.. ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. తగ్గింపు స్వభావం జీవితాన్నే మార్చేస్తుంది. కుటుంబాలు సౌఖ్యంగా ఉంటేనే.. పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతారు. హత్య చేయాలనే ఆలోచన మనసు దరిదాపుల్లోకి రాకుండాజాగ్రత్త పడాలి. క్షణికావేశం వల్ల జీవితం మొత్తం జైల్లోనే గడపాల్సి వస్తుంది. డబ్బు ఇచ్చే తాత్కాలిక ఆనందాన్ని చూడొద్దు. ఎప్పటికైనా బంధాలే శాశ్వతం.
– డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, కౌన్సెలింగ్ సైకోథెరపిస్టు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

