ద్రౌపది పరాభవంతో సమానం.. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు మగ పోలీసులతో వేధింపులు
శాసనసభ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం మహాభారతంలో ద్రౌపదికి జరిగిన పరాభవంతో సమానమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- ఎవరి ఆదేశాల మేరకు ఈ అకృత్యాలు? : గొంగిడి సునీత
- పథకం ప్రకారం సీఎం కుట్ర : తుల ఉమ, సుమిత్రానంద్
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): శాసనసభ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం మహాభారతంలో ద్రౌపదికి జరిగిన పరాభవంతో సమానమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాసమస్యలపై నిరసనగా నల్ల టీ-షర్టులు ధరించి వచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యేలను కావాలనే మహిళా కానిస్టేబుళ్లతో అడ్డుకున్నారని, అదే సమయంలో మహిళా ఎమ్మెల్యేల వద్ద మగ పోలీసులను మోహరించి వారిని తీవ్రంగా వేధించారని ఆరోపించారు. ఈ అకృత్యా లు స్పీకర్ ఆదేశాలతో జరిగాయా? లేక సీఎం రేవంత్రెడ్డి ప్రోద్బలంతో జరిగా యా? అని నిలదీశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆమె మీ డియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కావాలనే దళిత కార్డును రాజకీయ లబ్ధి కో సం వాడుకుంటున్నారని విమర్శించారు.
తోపులాటను లైంగిక వేధింపులుగా చిత్రీకరించి మహిళా కానిస్టేబుల్తో ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెట్టించడం ప్రభుత్వ కుట్రకు నిదర్శనమని దుయ్యబట్టారు. మహిళా కానిస్టేబుళ్లు దారికి అడ్డంగా ఉం డొద్దని తమ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదని, కేసు పెట్టిన కానిస్టేబుల్ను స్పీకర్ సన్మానించడం వెనుక ఉన్న దురుద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి పోక్సో కేసు నిం దితులకు రక్షణ కల్పిస్తూ, ప్రజల తరఫున పోరాడే ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు బనాయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో ఎంపీ గా ఉన్నప్పుడు రేవంత్రెడ్డి నల్లచొకా ధరించి పార్లమెంటుకు వెళ్లలేదా? అని తుల ఉమ ప్రశ్నించారు. నిరసనలు తెలిపితే లైంగిక వేధింపుల కేసులు పెట్టే నీచ రాజకీయాలకు రేవంత్రెడ్డి దిగజారడం అత్యంత హేయమని సుమిత్రానంద్ మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

