Kadem Project | కడెం ప్రాజెక్టు పియర్స్‌కు పగుళ్లు.. స్పిల్‌వేను కొత్తగా నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం
నిర్మల్ జిల్లాలోని పురాతన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు స్పిల్‌వేను కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పియర్స్‌కు పగుళ్లు ఏర్పడడంతో కేంద్ర డ్యాం సేఫ్టీ అధికారులు ఆందోళన వ్య క్తం చేశారు. కొత్తగా నిర్మించాలని సిఫార్సు చేయడంతో రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఆ దిశగా చర్య లు చేపట్టింది.
- ప్రాజెక్టు పియర్స్‌కు ఏర్పడ్డ పగుళ్లు
- కేంద్ర డ్యాం సేఫ్టీ అధికారుల ఆందోళన
- కొత్తగా నిర్మించాలని సిఫారసులు
- ఇన్వెస్టిగేషన్ కోసం ప్రతిపాదనలు
- ఇరిగేషన్‌శాఖ ఓఅండ్ఎం కమిటీ ఆమోదం
- ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
Kadem Project | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలోని పురాతన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు స్పిల్‌వేను కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పియర్స్‌కు పగుళ్లు ఏర్పడడంతో కేంద్ర డ్యాం సేఫ్టీ అధికారులు ఆందోళన వ్య క్తం చేశారు. కొత్తగా నిర్మించాలని సిఫార్సు చేయడంతో రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఆ దిశగా చర్య లు చేపట్టింది. నిర్మల్ జిల్లా పె ద్దూరు మండలంలో కడెం నదిపై 1949లో డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించగా 1958లో ప్రారంభమైంది. ఆ తర్వాత ఏడాదిలోనే డిజైన్ డిశ్చార్జి కన్నా ఎక్కువగా వరద రావడంతో అప్పటికే ఉన్న గేట్లకు అదనంగా మరో 9 గేట్లు అమర్చారు. మొత్తంగా 18గేట్లతో 1969లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
వరద ముంచెత్తడంతో బుంగ
ప్రాజెక్టు డిశ్చార్జ్ సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు కాగా, నిరుడు ఏకంగా 5.20 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తడంతో కొంత బుంగపడింది. ఈ ఏడాది కూడా డిశ్చార్జి సామర్థ్యానికి మించి 3.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టును ముంచెత్తింది. దీనికితోడు కడెం ప్రాజెక్టు నీటి నిల్వసామర్థ్యం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం నిల్వ సామర్థ్యం 7.60 టీఎంసీలుకాగా, నికరంగా 4.60 టీఎంసీలను వినియోగించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో 65 ఏళ్లు దాటిన కడెం ప్రాజెక్టు భద్రమా? కాదా? అనే అంశంపై అధ్యయనం చేసేందుకు ఇటీవల కేంద్ర డ్యాం సేఫ్టీ నిపుణుడు ఏబీ పాండ్యా ఆధ్వర్యంలో కేంద్ర అధికార బృందం, నిపుణులు, డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు మ్యాప్‌ను, రెండేళ్ల కాలంగా జరిగిన నష్టానికి సంబంధించిన ఫొటోలను, డ్యాం 18 వరదగేట్లు, కాలువ పరిస్థితులు, ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో, గేట్ల కౌంటర్ వెయిట్లు, రూప్స్, అదనపు స్పిల్‌వే సామర్థ్యం, గేట్ల విడుదల రూపకల్పన, లోడ్ డిశ్చార్జ్ తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సమగ్ర ఆనకట్ట భద్రత, గేట్లకు సంబంధించిన సమస్యలపై అధికారులతో చర్చించారు. డ్యాం రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సిఫారసులు చేశారు. అందుకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
కొత్త స్పిల్‌వే నిర్మాణం
కడెం ప్రాజెక్టు ప్రధాన స్పిల్ వేను పునర్నిర్మించాలని కేంద్ర డ్యాం సేఫ్టీ అధికార బృందం సూచించిం ది. ప్రాజెక్టు పియర్స్‌కు పగుళ్లు వాటిల్లాయని, ఇక ఎంతమాత్రమూ పనిచేయబోదని తన నివేదికలో వెల్లడించింది. వరదలో కొట్టుకొచ్చిన భారీ దుంగలు తగిలి గేట్లు సైతం దెబ్బతిన్నట్టుగా పేర్కొంది. వరద సామర్థ్యానికి అనుగుణంగా ఔట్‌ఫ్లో కోసం అదనపు వెయిట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. డ్యాం కరకట్లను మరింత బలోపేతం చేయాలని కూడా అభిప్రాయ పడింది. కడెం డ్యాంకు ఎంత వరద వస్తున్నది అనేది అంచనా వేసేందుకు క్యాచ్మెంట్ ఏరియాలో అవసరమైన గేజ్ మీటర్లను ఏర్పాటు చేయాలని సూచించింది.
మరో 39కోట్లతో ఓఅండ్ఎం పనులు
ఇప్పటికే ఇరిగేషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ విభాగం ఈ ఏడాదికి సంబంధించి 39 పనులకు ఆమోదం తెలిపింది. తాజాగా మరో రూ.39కోట్ల అంచనా వ్యయంతో మరో 56 పనులు చేపట్టేందుకు ఇటీవల నిర్వహించిన ఓఅండ్ఎం కమిటీ ఆమోదం తెలిపింది. అందులో ప్రధానంగా ఈ ఏడాది సంభవించిన అసాధారణ వరదలతో దెబ్బతిన్న తూములు, చెరువు కట్టల మరమ్మతు పనులు ఉన్నాయి. అవికాకుండా దిండి, నిజాంసాగర్, నాగార్జునసాగర్ కాలువల్లో జంగిల్ కటింగ్, హెడ్రెగ్యులరీల మరమ్మతులు, 10 ఐడీసీ స్కీములు కూడా ఉన్నాయి.
రూ.40 లక్షలతో ఇన్వెస్టిగేషన్
డ్యాం సేఫ్టీ సిఫారసుతో తెలంగాణ ప్రభుత్వం స్పిల్‌వే నిర్మాణం కోసం ఇన్వెస్టిగేషన్ నిర్వహించేందుకు రూ.40 లక్షలతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇరిగేషన్‌శాఖ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ (ఓఅండ్ఎం) కమిటీ ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. స్పిల్‌వే నిర్మాణానికి ఫౌండేషన్ కోసం నిర్వహించాల్సిన మట్టి, భూగర్భపరీక్షలు, ప్రాజెక్టులో ఇప్పటికే ఏ మేరకు పూడికఉంది? తదితర అంశాలపై ఇన్వెస్టిగేట్ చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

