జనగామ రైల్వేస్టేషన్లో రసాభాస
జనగామ రైల్వేస్టేషన్ ఆవరణలో ఆదివారం జరిగిన అమృత్ భారత్ స్టేష న్ పునరుద్ధరణ పనుల శంకుస్థాపన కా ర్యక్రమం రసాబాసగా ముగిసింది.
- వేదికపైకి పిలవలేదని రైల్వే అధికారిపై బీజేపీ నేత దాడి
- ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ తోపులాట
జనగామ, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): జనగామ రైల్వేస్టేషన్ ఆవరణలో ఆదివారం జరిగిన అమృత్ భారత్ స్టేష న్ పునరుద్ధరణ పనుల శంకుస్థాపన కా ర్యక్రమం రసాబాసగా ముగిసింది. కార్యక్రమం నిర్వహణలో రైల్వే అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని స్థానిక బీజేపీ నాయకుడు అభ్యంతరం చెప్పడంతో గొడవకు దారితీసింది. వేదికపైకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఆహ్వానించిన రైల్వే అధికారులు.. ఆయన సూచన మే రకే మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మున్సిపల్ మాజీ చైర్మన్లు, నాయకులను పిలిచారని కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్రగుప్తా అభ్యంతరం తెలిపారు.
ప్రొటోకాల్ ప్రకారం తన వార్డు పరిధిలో జరుగుతున్న కార్యక్రమం సభా వేదికపైకి తనను ఆహ్వానించలేదని రైల్వే అధికారితో వాగ్వాదానికి దిగారు. పేర్లు చదువుతున్న రైల్వే అధికారి చేతిలో నుంచి పేప ర్లు లాక్కొని ముఖంపై విసిరికొట్టారు. తీవ్ర పదజాలంతో రైల్వే అధికారిని దు ర్భాషలాడారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేదికపై ఉండగానే బీజేపీ, కాం గ్రెస్ శ్రేణులు గొడవపడ్డాయి. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

