Siddipet | తండ్రిని పట్టించుకోని కొడుకులు.. ఆస్తిని కొండగట్టు అంజన్న పేరున రాసేందుకు సిద్ధమైన తండ్రి
Siddipet | కొడుకులను పెంచి పెద్ద చేస్తే పట్టించుకోవడం లేదని ఓ తండ్రి ఆవేదన చెందాడు. తన యావదాస్తిని(Property) దేవుడి పేర రాసేందుకు సిద్ధమయ్యాడు.
సిద్దిపేట : కొడుకులు పున్నాగ నరకం నుంచి తప్పిస్తారని ఆశపడిన ఆ తండ్రికి కష్టాలే ఎదురయ్యాయి. కష్ట, నష్టాలకు ఓర్చి కొడుకులను పెంచి పెద్ద చేస్తే పట్టించుకోవడం లేదని ఓ తండ్రి ఆవేదన చెందాడు. తన యావదాస్తిని(Property) దేవుడి పేర రాసేందుకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దపేట(Siddipet) జిల్లా చిన్న కోడూరు మండలం అలీపూర్కు చెందిన బాలయ్య(Balaiah) తన కొడుకులు అన్నం పెట్టట్లేదని, సరిగా చూసుకోవట్లేదని మనస్థాపానికి గురయ్యాడు.
తన యావదాస్తిని కొండగట్టు అంజన్నకు(Kondagattu Anjana) సమర్పించేందుకు సిద్ధమయ్యాడు. తాను తీసుకున్న నిర్ణయం ప్రకారం కొండగట్టుకు చేరుకుని అనంతరం తనతో పాటు తీసుకువచ్చిన తన ఆస్తికి సంబంధించిన పత్రాలను కొండగట్టు దేవస్థానంలోని హుండీలో వేసేలా నిర్ణయం తీసుకున్నారు.
ఆస్తి పత్రాలు హుండీలో వేస్తే చెల్లదని పూజారులు చెప్పడంతో చివరి నిమిషంలో తన ఆలోచన మార్చుకున్నాడు. ఆస్తిని కొండగట్టు అంజన్న పేరుతో పట్టా చేస్తానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కోరారు. అందుకు అధికారులు సరేననడంతో బాలయ్య వెనుదిరిగాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

