హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): వరుసగా ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎవరికైనా మానసిక సమస్యలుంటే ‘టెలి మానస్’ సహాయం తీసుకోవాలని సూచించింది.
టోల్ ఫ్రీ నంబర్లు 14416 లేదా 1800914416 కు ఫోన్ చేస్తే మానసిక నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపింది. 24 గంటలపాటు నడిచే ఈ హెల్ప్‌లైన్‌తో ఇంటి నుంచే సహాయం పొందవచ్చని పేర్కొన్నది. డిప్రెషన్, తట్టుకోలేని బాధ, విపరీత ఆలోచనలు, ఇతర మానసిక ఇబ్బందులు ఎదురైతే ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చని స్పష్టంచేసింది.