నయీంనగర్, ఫిబ్రవరి 3: స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు.
పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనకు అప్పగించిన పనిని పూర్తి చేశానని, ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించానని తెలిపారు. హనుమకొండలో ఏర్పాటుచేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల అభిప్రాయం మేరకే ఏ పార్టీలో అయినా కొనసాగుతానని తెలిపారు.