హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక టెక్నాలజీల్లో ఒకటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) స్టార్టప్‌లకు టీ హబ్‌లో కోవర్కింగ్ స్పేస్‌ను కల్పించనున్నట్టు టీహబ్ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు ఈ స్టార్టప్‌ల నిర్వాహకులు https://bit.ly/47dkw6K లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
టీహబ్‌లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లో వినియోగించే అవకాశం ఉండటంతో స్టార్టప్‌లను ప్రారంభించే వారికి టీహబ్‌లో ప్రత్యేకంగా ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.