TGEAPCET | టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షురూ.. ఈ నెల 12 వరకు ఫస్ట్‌ఫేజ్ రిజిస్ట్రేషన్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్‌లో ప్రవేశించేందుకు టీజీ ఎప్‌సెట్ (TGEAPCET) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్ కొనసాగనుంది.
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్‌లో ప్రవేశించేందుకు టీజీ ఎప్‌సెట్ (TGEAPCET) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏదో ఒకచోట ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. పరిశీలన చేయించుకున్న వారు ఈ నెల 8 నుంచి 15 వరకు వెబ్ఆప్షన్లు నమోదుచేసువాల్సి ఉంటుంది. వారికి ఈ నెల 19న లేదా ఆ లోపు తొలి విడత సీట్లు కేటాయించనున్నారు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు జులై 19 నుంచి 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
కాగా, గతేడాది వరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఒక వెబ్సైట్, ప్రవేశాల కౌన్సెలింగ్‌కు మరో వెబ్సైట్ ఉండేది. దాంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యేవారు. ఈసారి ఎప్‌సెట్ వెబ్సైట్ www.eapcet.tsche.ac.inలోకి వెళ్లినా అక్కడ అడ్మిషన్‌పై క్లిక్ చేస్తే కౌన్సెలింగ్ వెబ్సైట్లోకి వెళ్లొచ్చు.
ఇంజినీరింగ్ కోర్సులు: బీఈ/ బీటెక్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (బయో-టెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (ఎంపీసీ), ఫార్మ్-డి (ఎంపీసీ).
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సులు: బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ(ఫారెస్ట్రీ), బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (బైపీసీ), ఫార్మ్-డి (బైపీసీ).
తొలిదశ కౌన్సెలింగ్ షెడ్యూల్..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్: జూలై 04 నుంచి 12 వరకు
ధ్రువపత్రాల పరిశీలన: జూలై 06 నుంచి 13 వరకు
ఆప్షన్ల ఎంపిక: జూలై 08 నుంచి 15 వరకు
ఆప్షన్ల ఫ్రీజింగ్: జూలై 15
సీట్ల కేటాయింపు: జూలై 19
సెల్ఫ్ రిపోర్టింగ్: జూలై 19 నుంచి 23 వరకు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

