కుమ్రం భీం భీమ్ అసిఫాబాద్ : బాలికపై లైంగిక దాడి(Minor assault)కి పాల్పడిన కేసులో నిందితుడికి పది సంవత్సరాల జైలు(Jail) శిక్ష విధిస్తూ అసిఫాబాద్ జిల్లా(Asifabad dist) సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.వి రమేశ్ తీర్పు ఇచ్చారు. కౌటాల సీఐ సాదిక్ పాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన లైంగిక దాడి ఘటనలో రవీంద్ర నగర్‌కు చెందిన సత్యజిత్ మండల్ A1 (25 ), సదన్ మండల్ A2, జావా మండల్ A3 అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.
అప్పటి సీఐలు బి.శ్రీనివాస్, బుద్ధ స్వామి, డి.మోహన్ విచారణ చేశారు. పోలీసుల విచారణ అనంతరం సాక్ష్యాదారాలతో ఛార్జిషీట్ దాఖలు చేసి పోలీసులు సాక్ష్యులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాద్ ప్రవేశపెట్టిన సాక్షుల విచారణ అనంతరం కేసు పూర్వపరాలను పరిశీలించి నిందితుడికి 420,376,417 ఐపీసీ, సెక్షన్ 04 ఫోక్సో చట్టం కింద పది సంవత్సరాలు జైలు శిక్ష, రూ.35 వేల జరిమానా విధించారు. కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ కే సురేష్ కుమార్ అభినందించారు.