Yogoda Satsanga Society: సైంటిఫిక్ హీలింగ్ పుస్తకం తెలుగు అనువాదం రిలీజ్
Yogoda Satsanga Society: యోగానంద రచించిన 'సైంటిఫిక్ హీలింగ్ ఎఫర్మేషన్స్' తెలుగు అనువాదం “శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు” అనే పుస్తకాన్ని విడుదల చేశారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా స్టాలులో ఈ పుస్తకాన్ని స్వామి ప్రజ్ఞానంద విడుదల చేశారు.
హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ(Yogoda Satsanga Society) ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద రచించిన ‘సైంటిఫిక్ హీలింగ్ ఎఫర్మేషన్స్’ తెలుగు అనువాదం “శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు” అనే పుస్తకాన్ని ఇవాళ విడుదల చేశారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా స్టాలులో ఈ పుస్తకాన్ని స్వామి ప్రజ్ఞానంద విడుదల చేశారు. ఈ పుస్తకంలో సాధకుడిలోని స్వస్థతాశక్తిని అర్థం చేసుకొని నిత్యజీవితంలో ఆచరించడానికి ఈ పుస్తకం ఒక మార్గదర్శినిగా ఉపయోగపడుతుందని స్వామీజీ తెలిపారు. ఆత్మసాక్షాత్కారం కోసం క్రియాయోగ ధ్యాన ప్రక్రియను అభ్యాసం చేయాలని స్వామి ప్రజ్ఞానంద సూచించారు. క్రియాయోగ పాఠాల కోసం హైదరాబాద్‌లోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ధ్యాన కేంద్రాన్ని సందర్శించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు క్రియాయోగులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

